చిరంజీవి కుమార్తె వెడ్డింగ్ కార్డ్ వెరీ గ్రాండ్
హైదరాబాద్: చిరంజీవి కుమార్తె సుస్మిత వివాహం మార్చి రెండో తేదీన హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ కాంప్లెక్స్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. కుమార్తె వివాహ ఉత్సవ ఆహ్వాన కార్డును చిరంజీవి చాలా గ్రాండ్‌గా తయారుచేయించి వివిధ రంగాల ప్రముఖులకు పంపిస్తున్నారు. ఎల్ ఆర్ శివప్రసాద్, చంద్రికల కుమారుడు, కీర్తిశేషులు ఎల్‌వి రామయ్య మనవడు అయిన విష్ణుప్రసాద్‌తో వివాహం జరిపించనున్నట్టు ఆహ్వానపత్రంలో ఉంది. మార్చి రెండో తేదీ రాత్రి 10.59కి వివాహం జరుగుతుంది. ఎనిమిది గంటల నుంచి డిన్నర్ ప్రారంభమవుతుంది. వరుడు రాయలసీమకు చెందిన వారు కావడంతో ఆ ప్రాంతం నుంచి ముఖ్యంగా అనంతపురం జిల్లా కదిరి నుంచి చిరంజీవి అభిమానులు ఈ వివాహానికి స్వచ్ఛందంగా హాజరవుతున్నట్టు సమాచారం. వధూవరులను దూరం నుంచి చూసి అయినా వెనుదిరగాలని చిరు అభిమానుల ఆకాంక్ష.


Click it and Unblock the Notifications