నెం.1 తమ్ముడే అన్న చిరు: ఫ్యాన్స్ ఏకీభవించారు!

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలో నెం.1 స్థానానికి చేరుకుని తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమా పరిశ్రమ నుండి వెళ్లి పోయిన తర్వాత నెం.1 స్థానం చాలా కాలం పాటు ఖాళీగానే ఉండి పోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఆ స్థానాన్ని అందుకోవడం కోసం పోటీ పడ్డారు.

గతంలో వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడిన పవన్ కళ్యాణ్....ఆ తర్వాత హిట్ సినిమాల బాట బట్టి నెం.1 స్థానానికి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మహేష్ బాబు లాంటి హీరోలు గట్టి పోటీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రంతో పవన్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పవన్ నెం.1 స్థానానికి అందుకున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Chiru declaring Pawan as the current No.1

తాజాగా పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పెట్టిన సందర్భంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ...పవన్ ప్రస్తుతం సినిమాల్లో నెంబర్ 1గా ఉన్నారని చెప్పారు. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అభిప్రాయపడ్డారు. అతనికి సొంతిల్లు లేదని, అతను చాలా డబ్బు కోల్పోయాడన్నారు.

పవన్ నెం.1 అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఏకీభవించారు. అయితే రాజకీయాల్లో పవన్ రావాల్సిన సమయం ఇది కాదని చిరంజీవి వ్యాఖ్యానించడం కొందరు అభిమానులకు నచ్చడం లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల బాటపట్టి సినిమాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకోవడం పలువేరు అభిమానులను అసంతృప్తికి గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X