చిరుకు మధ్యంతరం చింత?
చిరంజీవి ఇంకా రాజకీయాలలోకి రాలేదు కానీ అపుడే రాజకీయం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మధ్యంతరం వస్తే వేగంగా పార్టీని స్థాపించాలి-ఎన్నికల సమరాంగనానికి సిద్ధం కావాలి. మధ్యంతరం రాకపోతే మంచి సినిమాలలో నటించి అభిమానుల మన్ననలు పొందాలి. తను హీరోగా రూపొందే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాలి. ఇవీ చిరుముందున్న సమస్యలు.
మధ్యంతరం వస్తుందని రాజకీయ పార్టీలన్నీ ఊదరగొడుతున్నాయి. చిరంజీవి మాత్రం 149 చిత్రం కోసం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉయ్యాలాడ నరసింహ్మారెడ్డేనని ఫిల్మ్ నగర్ సమాచారం. నిజానికి ఈ సినిమాను చిరంజీవి 150వ సినిమాగా స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని చిరంజీవి కలలు కన్నారు. పరిస్థితులేమో ఇపుడు తారుమారయ్యాయి. రాజకీయాలలోకి వచ్చే అంశాన్ని పత్రికలు టామ్ టామ్ చేశాయి. వస్తే ఒక సమస్య రాకుంటే మరో సమస్య. ముందు నుయ్యి-వెనుక గొయ్యి అన్నమాట.
కమ్యూనిస్టుల సహకారంతో నడుస్తున్నకేంద్రానికి వారు ఎప్పటైనా రెడ్ సిగ్నల్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. గుజరాత్ లో మోడీ గెలిస్తే కమ్యూనిస్టులు మిన్నకుండిపోతారు. మధ్యంతరం ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. అదే మోడీ ఓడిపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వానికి టాటా చెప్పే అవకాశం ఉంది. మధ్యంతరం అందరూ అనుకున్నట్టే మార్చిలోనే ఎదురు కావచ్చు. అందుకే చిరంజీవి అప్రమత్తంగా ఇంకా చెప్పాలంటే నిద్రపోకుండా ఎప్పుడేం జరుగుతుందో గమనించాల్సిన స్థితి.


Click it and Unblock the Notifications











