చిరు కుటుంబ హీరోలకు కష్టాలు

రామ్ చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మగధీర'. కాజల్ కథానాయిక. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాత. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో పోరాట దృశ్యాల్ని చిత్రించారు. ఏప్రిల్ మాసంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు తొలుత భావించారు. అయితే ఎన్నికల సమయం కావడంతో మే మొదటి వారంలో 'మగధీర'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొంటున్నారని సమాచారం. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు. కథ: విజయేంద్ర ప్రసాద్, స్త్టెలింగ్: రమా రాజమౌళి, సంగీతం: కీరవాణి.


Click it and Unblock the Notifications











