twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు కుటుంబ హీరోలకు కష్టాలు

    By Staff
    |

    Ram Charan Teja
    చిరంజీవి కుటుంబంలోని హీరోలకు ఎన్నికల స్ట్రోక్ తగులుతోంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ 'పులి" చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. ఎన్నికల ప్రచారంలో లేకపోయినా రామ్ చరణ్ తేజ చిత్రం విడుదల ఒక నెలరోజుల పాటు వాయిదా పడనుంది.

    రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మగధీర'. కాజల్‌ కథానాయిక. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాత. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో పోరాట దృశ్యాల్ని చిత్రించారు. ఏప్రిల్‌ మాసంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు తొలుత భావించారు. అయితే ఎన్నికల సమయం కావడంతో మే మొదటి వారంలో 'మగధీర'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొంటున్నారని సమాచారం. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు. కథ: విజయేంద్ర ప్రసాద్‌, స్త్టెలింగ్‌: రమా రాజమౌళి, సంగీతం: కీరవాణి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X