»   » రామ్ చరణ్ అల్లు అరవింద్ కి పోటి అవుతాడా లేక స్టార్ ఫిలింమేకర్ గా ఎదుగుతాడా..!?

రామ్ చరణ్ అల్లు అరవింద్ కి పోటి అవుతాడా లేక స్టార్ ఫిలింమేకర్ గా ఎదుగుతాడా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి నటించే 150వ చిత్రాన్ని చరణ్ నిర్మించనున్నాడనే వార్త రావడంతో మెగా ఫాన్స్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 149 సినిమాలు చేసే వరకు చిరంజీవి సొంతంగా నిర్మాణ సంస్థ అంటూ పెట్టలేదు. ఎక్కువగా అల్లు అరవింద్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసిన చిరంజీవి, తన తమ్ముడు నాగబాబు నిర్మాతగా, తల్లి పేరు మీద పెట్టిన అంజనా ప్రొడక్షన్స్ లో అడపాదడపా సినిమాలు చేసేవారు. అయితే చిరంజీవి నిర్మాతగా ఇంతవరకు ఒక్క సినిమా కూడా రూపొందలేదు.

చరణ్ సొంతంగా బ్యానర్ పెట్టడం అంటే అది కేవలం చిరంజీవి 150వ సినిమా కోసమే అనుకోవడానికి లేదు. ఇకపై చరణ్ నటించే చిత్రాలతో పాటు ఇతరులతోను ఈ బ్యానర్ లో సినిమాలు రూపొందించే అవకాశముంది. అంటే గీతా ఆర్ట్స్ కి, అంజనా ప్రొడక్షన్స్ కి ప్రత్యామ్నాయంగా మరో మెగా బ్యానర్ పుట్టుకొచ్చినట్టే అనాలి.

నిర్మాతగా అల్లు అరవింద్ అగ్రశ్రేణికి చేరుకోవడంలో, నేడు బాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ తీయగలిగే స్థాయికి వెళ్లడంలో చిరంజీవి చిత్రాలది కీలక పాత్ర. అల్లు ఇంట్లోను ఇప్పుడు అల్లు అర్జున్ రూపంలో ఒక సేలబుల్ హీరో ఉన్నా, 'మగధీర" చరణ్ తో పోలిస్తే అతని మార్కెట్ చాలాచాలా తక్కువ. కనుక ఇక పై చరణ్ సొంత బ్యానర్ లోనూ సినిమాలు నిర్మిచడం స్టార్ట్ చేస్తే అది అందరికంటే ఎక్కువగా అల్లు అరవింద్ కే షాకింగ్ న్యూస్ అనడంలో అతిశయోక్తి లేదు. మరి చెర్రీ ప్రొడక్షన్స్ ని సింగిల్ మూవీకే పరిమితం చేసేందుకు అల్లు తనదైన శైలిలో పావులు కదుపుతాడో లేక చెర్రీ ప్రొడ్యూసర్ గాను ప్రూవ్ చేసుకుని మెగాస్టార్ల ఫ్యామిలీలో స్టార్ ఫిలింమేకర్ గా ఎదుగుతాడో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu