Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ గ్లామర్ తోనే ‘చిరు’కి మళ్ళీ మీడియాలో హాట్ టాపిక్...
రాజకీయాల్లో చిరంజీవి ఏం చేస్తున్నారు..? ఏం చేయబోతున్నారు..?ఏం సాధిస్తారు..?అనే విషయాల్ని పెద్దగా పట్టించుకోవడంలేదవరూ. ఏపీ మీడియా అయితే ఈ మధ్యన పొలిటికల్ డిస్కషన్స్ లో పీఆర్పీని కన్సిడర్ చేయడం లేదు కూడా. అప్పుడప్పుడు చిరంజీవి పేరు మిడియాలో విన్సిస్తున్నా, 'గ్యాప్ ఫిలీం కోసమే.." అన్న కామెంట్లు విన్సిస్తున్నాయి మీడియా సర్కిల్స్ లో. అయితే చిరంజీవి కొత్త సినిమా గురించి మాత్రం మీడియా సర్కిల్స్ లో అదీ సినిమా కాలమ్స్ లో బాగానే కానవస్తున్నాయి.
వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తాడనీ, పరుచూరి బ్రదర్స్ కథ అందించనున్నారనీ, చాలాకాలంగా చిరంజీవి 150వ సినిమా గురించిన ఊహాగానాలు మీడియా సర్కిల్స్ లో సంచరిస్తోన్న సంగతి విదితమే. 'డాడీ 150వ సినిమాకి నేనే నిర్మాతనని.." అంటూ ఆ మద్యన చరణ్ ప్రకటించడం..ఫిబ్రవరిలో సినిమా ప్రారంభమవుతుందని చిరంజీవి చెప్పడం..వెరసి వచ్చే నెలలో అయినా చిరంజీవి సినీ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతారా..?అనేది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజుకో కొత్త టర్న్ తీసుకుంటుండడంతో, చిరంజీవి ఎక్కవగా సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. కనీసం ఇకనైన రాజకీయాల్ని పక్కన పెట్టి సినీ గ్లామర్ తో మళ్ళీ అభిమానుల్ని రక్తికట్టిస్తే, అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుందనీ, ఇలా రకరకాలుగా ఉచిత సలహాలిస్తున్నవారూ లేకపోలేదు. ఈ నేపద్యంలో తన 150వ సినిమాకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే..ఆ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తే..మళ్ళీ చిరంజీవి రెగ్యులర్ గా మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే వుంటారన్నది నిర్వివాదాంశం. మరి ఆ విషయమై చిరంజీవిలో సీరియస్ నెస్ వుందా..? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.