తిరుపతిలో చిరు సంబరాలు
చిరంజీవి రాజకీయ పార్టీ ఇంకా ప్రారంభించకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు జరపడంలో తిరుపతి ముందుంది. ఆయన అభిమానులు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చారు. పెద్దయెత్తున ర్యాలీ తీశారు. పెద్దపెట్టున చిరంజీవికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉభయ-గోదావరి జిల్లాలోని పలు పట్టణాలలో అభిమానులు వీధుల్లో గుమిగూడి ఆనందంగా చిరంజీవి పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. రాజమండ్రి, విశాఖపట్టణంలో అభిమానుల సందడి మరింత ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications











