చిరుగాలికే హోరెత్తుతున్నగోదావరి!
చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారంనాడు ఆయన అభిమానుల ర్యాలీలతో సభలతో హోరెత్తిపోతోంది. భీమవరం, నర్సాపురం, మొగల్తూరు తదితర పట్టణాలలో అభిమానులు పెద్దయెత్తున ర్యాలీలు తీశారు. భీమవరంలో దేవాలయాలలో పూజలు నిర్వహించారు.
ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న అవినీతిని నిర్మూలించే సత్తా ఒక్క చిరంజీవికే ఉందని భీమవరం అభిమానులు అంటున్నారు. భీమవరం స్థానిక బిఎస్పీ మహిళా నేత చిరంజీవి మద్ధతుగా ర్యాలీలో పాల్గొంది. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలలో కాపు కులస్తులు ఎక్కువగా ఉన్నందున ఆయన వారి ప్రతినిథిగానే ఉంటారని కొంతమంది చేస్తున్న విమర్శలను ప్రజలు తిప్పకొడుతున్నారు. సి అంటే క్రిష్టియన్, హెచ్ అంటే హిందూ అని, ఐ అంటే ఇస్లాం అని మొత్తంగా చిరంజీవి అందరివాడని అభిమానులు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.
గుంటూరు జిల్లా బాపట్లలోని హనుమాన్ గుడిలో చిరంజీవి అభిమానులు పూజలు నిర్వహించారు. చిరంజీవి రాజకీయాలలోకి రావాలని పండ్లు పంచిపెట్టారు.


Click it and Unblock the Notifications











