మున్నాభాయ్ 3.... చిరుపై ఫ్యాన్స్ ఆశలు!
మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగే రహో మున్నాభాయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో మున్నాభాయ్, సర్క్యూట్ పాత్రల్లో సంజయ్‌దత్, అర్షద్ వార్సి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ సినిమాల తెలుగు రీమేకులు శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్‌లు ఇరగదీశారు.
కాగా...ఆరేళ్ల తర్వాత మున్నాభాయ్ మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలి రెండు సినిమాల్ని మించిన స్క్రిప్టు తయారుచేయడమే మా ముందున్న పెద్ద సవాలు. అయితే ఆ సినిమాని తీస్తామనేది వంద శాతం నిజం'' అని దర్శకుడు హిరాణీ తెలిపారు. నాలుగేళ్ల నుంచీ ఆ స్క్రిప్టుపై పని జరుగుతోందనీ, ఒకట్రెండు నెలల్లో స్క్రిప్టు సిద్ధమవుతుందనీ నిర్మాత చోప్రా చెప్పారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. చిరంజీవి 150వ సినిమా కోసం కళ్లు కాయలు కాసే ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సీక్వెల్‌లో తప్పకుండా నటిస్తారనే నమ్మకంతో ఉన్నారు.
కథ దొరకడమే ఆలస్యం, 150వ సినిమా చేయడానికి సిద్ధమని రచ్చ ఆడియో వేడుకలో చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ మున్నాభాయ్ స్టీరీ చిరంజీవి గతంలో పర్ ఫెక్టుగా సెట్టయింది. ఆ పాత్రలో తెలుగులో ఇంకొకరిని ఊహించుకోవడం కష్టంమే. ఈ నేపథ్యంలో మున్నాభాయ్ 3 కథ కూడా చిరంజీవికి 100% సరిపోతుందని, చిరంజీవి కథకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











