చిరంజీవిది కాపీ కొట్టిన వర్మ
చిరంజీవి, రాద, విజయశాంతి నటించిన కొండవీటి దొంగ చిత్రం అప్పట్లో మ్యూజికల్ గానూ సంచలనం సృష్టించింది. ఇప్పుడు అందులోని శుభలేక రాసుకున్న మదిలో ఎపుడో అనే ట్యూన్ ని కాపీ చేస్తూ ఓ సినిమా రాబోతోంది. అయితే అది మరేదో కాదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రెడీ అవుతున్న అడవి. నితిన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోని పాటలను ఈ మధ్య ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాకు స్క్రీనింగ్ చేసారు. అందులో ఓ ట్యూన్ అదే కావటంతో అందరూ ఆశ్చర్యపోవటం జరిగింది. ఇక ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ నా ఎయిట్ ప్యాక్ బాడీని నేను ఓ పాటలో చూపెడతాను..నా అబిమానులు అది ఆనందాన్నిస్తుందన్నాడు. జూలై 17 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు బాషల్లో రూపొందింది. హాలీవుడ్ హిట్ ప్రిడియోటర్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది అని అంతటా వినపడుతోంది. ఇక ఈ సినిమాతో నయినా నితిన్ తన ప్లాఫ్ ముద్ర పోగొట్టుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











