"చిరు కాపు ప్రతినిధి కాదు"
చిరంజీవి ఒక కులానికి చెందినవాడు కాదని...అందరివాడని కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావు ప్రకటించారు. చిరంజీవి కాపులకు ప్రతినిధిగా బావిస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కార్యక్రమాలను రూపొందించుకుని కులప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి ఒక కాపులకోసమే రాజకీయాలలోకి రావడంలేదని, అన్ని కులాలవారు ఆయనను రాజకీయాలలోకి ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే కొంతమంది చిరంజీవి కాపు ప్రతినిధి అంటూ ప్రచారం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం శోచనీయమని ఆయన అన్నారు. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఆ తరువాత కుల పరంగా స్పందిస్తామని, అంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications











