కంగుతిన్న చిరు మిత్రుడు!!
పనికట్టుకుని అన్ని ప్రధాన తెలుగు వార్తా పత్రికల విలేకరులను పిలిచి చిరంజీవి పార్టీ విషయాన్ని చర్చించిన డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి కంగుతిన్నారు. చిరంజీవి ఆప్తమిత్రుడైన ప్రసాదరెడ్డి అన్ని విషయాలు ఆయా విలేకరులతో చర్చించినప్పటికీ చిరు వార్త ఈనాడులో రాకపోవడం ఆయనను విస్మయానికి గురిచేసినట్టు సమాచారం. చిరంజీవి బావమరిది కూడా ఈ విషయంలో తీవ్ర ఆశ్చర్యానికి గురైనట్టు సమాచారం. రామోజీని కలవడానికే అల్లు అరవింద్ సమాయత్తమయినట్టు తెలుస్తోంది. వార్తను ప్రచురించడానికి స్పేస్ ను కూడా మొదటి పేజీలో కేటాయించిన ఈనాడు ఎందుకు చివరి నిమిషంలో విరమించుకున్నారో అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నారు. చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పత్రిక ఓనర్ స్టాండ్ ఏమిటో ఎవరికి ఎరుక. ఇప్పుడున్న పత్రికలన్నీ ఎజెండాలమీద నడుస్తున్నవాయె. ఇంకా చెప్పాలంటే పార్టీల పాంప్లెట్స్ అయ్యాయి కదా. ఇదేమన్నా కందుకూరి విరేశలింగం కాలమా చెప్పండి.


Click it and Unblock the Notifications











