'సోంబేరి' లో చిరంజీవి....

అలీ లేటెస్టు గా హీరోగా నటిస్తున్న సినిమా 'సోంబేరి' . 'శోభనానికి కూడా బద్ధకస్తుడే' అన్నది ట్యాగ్‌లైన్ .ఈ సినిమాలో చిరంజీవి కనిపించబోతున్నారనే వార్త బయిటకు రాగానే అన్ని వర్గాల్లో సంచలనమైంది. 'పెళ్లాం పిచ్చోడు' (రాజేంద్రప్రసాద్ హీరో ) తో దర్శకుడి గా మారిన లిరిక్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకుడు. ఇక సినిమాలో ఎయిడ్స్‌పై చైతన్యం కోసం ఉద్దేశించిన ఒక పాట ఉంటుంది. అందులో చిరంజీవి దర్శనమివ్వనున్నారు. అంటే ఆయన నటిస్తున్నారని కాదు. ఆయన నిలువెత్తు బొమ్మను ఈ పాటలో చూపిస్తారు. అలాగే ఈ పాటలో మదర్ ధెరీసా కూడా బొమ్మ రూపంలో కనిపిస్తుంది.
ఈ సినిమాలో టైటిల్‌కి తగ్గట్లు అలీ పరమ బద్ధకస్తుడిగా కనిపిస్తాడు. అతను ఎలా తన బద్ధకాన్ని వదిలించుకుని ప్రయోజకుడయ్యాడన్నది మిగతా కథ. ఇందులో అలీ సరసన హీరోయిన్ గా రుక్ష అనే కొత్త అమ్మాయ పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని యర్రమిల్లి వెంకటరావు నిర్మిస్తున్నారు.మనో సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మథ్యనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసారు.పై వారంకి అన్ని పనులు పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. మొత్తానికి చిరంజీవికే కాదు ఆయన కటౌట్ పెట్టినా కూడా యెంత క్రేజ్ అనేది దీనితో ఋజువైంది అని అభిమానులు ఆనందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











