చిరంజీవితో పూరీ జగన్నాధ్ కామెడీ చిత్రం
చిరంజీవి, పూరీ జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది. పోకిరి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రను తిరగరాసిన పూరీ జగన్నాధ్ చిరంజీవితో ఒక మంచి కామెడీ సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా పేరు శ్రీకృష్ణుడు ఫ్రం సురభి కంపెనీ. యూత్‌ని అలరించి, అలరించి విసిగిపోయిన చిరంజీవి తాను ఎంతగానో ఇష్టపడే పిల్లల కోసం, బాగా గౌరవించే పెద్దల కోసం ఒక మంచి కామెడీ సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. కామెడీ చిత్రమైన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో ఆయన నటించినా అది ఫేమస్ రీమేక్ కావడంతో ఆయనకు పూర్తి సంతృప్తి కలగలేదు. అయితే పూరీ జగన్నాధ్ వంటి యాక్షన్ సినిమాల డైరెక్టర్ కామెడీ సినిమాను ఎలా తీస్తారన్న అనుమానం రావచ్చు. హాలివుడ్ సినిమాలను ఒకటికి పది సార్లు చూసే పూరీ జగన్నాధ్ చిరంజీవి కోసం మంచి కామెడీ కథను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, పూరీ ఇద్దరూ చాలా బిజీగా ఉన్నప్పటికీ తీరిక సమయంలో కథా చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో...


Click it and Unblock the Notifications