చిరు ఏ పార్టీలో చేరొద్దు
చిరంజీవి ఏ పార్టీలో చేరకుండా సొంతగా పార్టీ పెట్టాలని రాజమండ్రి అభిమానులు అంటున్నారు. ఉన్న పార్టీలన్నీ కుళ్లు రాజకీయాలతో కునారిల్లుతున్నాయని వారంటున్నారు. సొంతగా పార్టీ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 250 సీట్లు గెలుపొందడం ఖాయమని వారంటున్నారు. ఆయన పార్టీ పెడితే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామని వారంటున్నారు.
చిరంజీవి పార్టీ పెట్టి ఇంతకు ముందున్న వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన నూతన సమాజాన్ని నిర్మించాలని అంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు, యువతకు లాభం చేకూర్చి జై చిరంజీవా అన్నట్టు ఆయన కొత్త శకానికి నాంది పలకాలని అభిమానులు అంటున్నారు.
రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రాజమండ్రికి వచ్చిన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన చిరంజీవి అభిమానులు పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు చిరంజీవి వెంటనే పార్టీ ప్రారంభించాలని బలంగా కోరారు.


Click it and Unblock the Notifications