చిరు చేతుల మీదుగా మంచు ఫ్యామిలీ ఆడియో

By Srikanya

హైదరాబాద్ : టామ్ అండ్ జెర్రీలమని స్వయంగా చెప్పుకునే చిరంజీవి,మోహన్ బాబు ఒకే వేదికపై కలవనున్నారు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తాజా చిత్రం 'దేనికైనా రెడీ' ఆడియో పంక్షన్ కి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ఆడియో పంక్షన్ జరగనుంది. విష్ణు, హన్సిక జంటగా రూపొందుతున్న చిత్రం 'దేనికైనా రెడీ'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

మంచు విష్ణు మాట్లాడుతూ... " ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దాంతో పాటు తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. తొలిసారిగా నా సినిమా మలయాళంలో డబ్బింగ్ అవుతోంది. ఈ మలయాళ వెర్షన్ పాటలు అలరిస్తాయి. దాని డబ్బింగ్ పనులు పూర్తికావచ్చాయి. 'గాడ్స్ ఓన్ కంట్రీ'లో 'దేనికైనా రెడీ' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా ఆదరణ పొందుతుందనీ, అందరు మలయాళీల హృదయాల్ని స్పృశిస్తుందనీ ఆశిస్తున్నా. అక్టోబర్ తొలి వారంలో మలయాళ వెర్షన్ పాటల్ని కొచ్చిలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.

ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్‌తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి...వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.

ఈ సినిమా మలయాళంలో అనువాదమవుతోంది. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకేసారి అక్టోబర్‌లో విడుదల కాబోతోంది. సుమన్, సీత, ప్రభు, కోట శ్రీనివాసరావు, విక్రమ్ ప్రధాన తారాగణమైన ఈ చిత్రానికి కథా విస్తరణ: బీవీఎస్ రవి, నాగేశ్వరరెడ్డి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, సంగీతం: చక్రి, యువన్‌శంకర్ రాజా, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్, ఫైట్స్: సెల్వా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వంశీకృష్ణ, సమర్పణ: బేబీ అరియానా, బేబీ వివియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X