చిరు మెగాస్టార్ అయితే బాలయ్య ‘నటసింహా’!
ప్రస్తుతం ఉన్న హీరోల బిరుదుల వెనుక స్టార్ అనే పదం ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, రియల్ స్టార్ ఇలా ఏదో ఒకటి పెట్టుకుని చివరన స్టార్ అనే పదాన్ని చేర్చుతున్నారు. అయితే నందమూరి బాలయ్య అభిమానులు మాత్రం తమ హీరోల పేర్లలో స్టార్ ను కోరుకోవడం లేదు. పులి, సింహాలను కోరుకుంటున్నారు..బాలయ్యకు కొంతకాలంగా 'యువరత్న' అనే పిలుచుకుంటున్నారు. కానీ సింహా చిత్రం తర్వాత అతని అభిమానులు 'నటసింహాం" అనే బిరుదుతో పిలుస్తున్నారు. అంతే కాదు ఇకపై బాలయ్యను ఎవరైనా యువరత్న అంటే ఒప్పుకోరట. నటసింహాం అనే పిలవాలట. మరి దాసరి చిత్రం విడుదల తర్వాత 'పరమవీరచక్ర" అని అనమంటారేమో!!
మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పులి మరి పులులు, సింహాలు లేకుండా వీరిని పిలుచుకోలేరన్నమాట. వీళ్ల సంగతి ఏమోగానీ..గిట్టని వాళ్లు మాత్రం ఓహో! ఇవన్నీ జంతువులే కాబోలు అని అనుకునే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











