దాసరి కంటతడి- చిరు ఓదార్పు
భార్యా వియోగంతో కన్నీరు మున్నీరవుతున్న దర్శక రత్న దాసరి నారాయణ రావును చిరంజీవి శుక్రవారం స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. పోయిన వాళ్లు తిరిగిరారు కాబట్టి వాళ్ల స్మృతులతో మనం మిగిలిన జీవితాన్ని లాగించాలని, వారు లేరని బాధ పడుతూ ఉంటే...మన బాధ చూడలేక పైనున్న వారి ఆత్మ మరింత శోకిస్తుందని ధైర్యం చెప్పారు. చిరంజీవితో పాటు ఆయన బావ మరిది అల్లు అరవింద్ కూడా దాసరిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దాసరి నారాయణ రావు భార్య పద్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











