దబంగ్ సినిమా రైట్స్ కొనుగోలు చిరంజీవి కోసమేనా?
ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాన్ని పక్కన పెడితే ఆయన 150వ చిత్రం ఏమిటా అని అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా విడుదలయిన సూపర్ హిట్ చిత్రం దబంగ్ చిత్రం చిరంజీవి కొత్త చిత్రం కావచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే చిరంజీవి దబంగ్ చిత్రం యొక్క రీమేక్ హక్కులను కొన్నట్టు సమాచారం.
దబంగ్ చిత్రం కామెడీ మాస్ ఎంటర్టయినర్ చిత్రం. ఇంతకుముందు చిరంజీవి సంజయ్ దత్ ముఖ్యపాత్రలో వచ్చిన మున్నాబాయి ఎంబీబీఎస్, మున్నాబాయి జిందాబాద్ చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు కూడా కామెడి ఎంటర్టయినర్తో కూడుకున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు. చిరంజీవి నటించిన ఆ రెండు చిత్రాల్లో ఒకటి ఫెయిల్ కాగా మరొకటి హిట్ అయింది. అయితే చిరంజీవికి మంచి పేరు తీసుకు వచ్చాయి.
చిరంజీవి కొత్త చిత్రం త్వరలో ప్రారంభమవుతుందని గత కొద్దికాలంగా వస్తున్న సమాచారం నిజమన్నట్టు చిరంజీవి సైతం ఇటీవలే ప్రకటన చేశారు. 2011 ఫిబ్రవరిలో చిత్రం ప్రారంభమవుతుందని, అదే సంవత్సరం దసరా వరకు విడుదలవుతుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. చిత్రంకోసం నెలకు 10 రోజులు పార్టీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చిత్రీకరణ చేస్తామని చెప్పారు. ఆలా చెప్పిన కొద్దిరోజుల్లోనే చిరంజీవి దబంగ్ చిత్రం, అదీ మున్నాబాయి తరహా కామెడీ ఎంటర్టయినర్ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడంతో చిరంజీవి కొత్త చిత్రం దబంగే అన్న ఊహాగానాలు పరిశ్రమనుండి వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రం చిరంజీవే చేస్తాడని పూర్తిగా చెప్పలేము. కామెడిని బాగా పండించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఈ చిత్రాన్ని తీసుకున్నారనేది మరో సమాచారం. గత కొద్దికాలంగా వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ కామెడి ఎంటర్టయినరయిన దబంగ్ లో నటిస్తే మళ్లీ విజయాల బాటన పట్టవచ్చు.


Click it and Unblock the Notifications











