చిరు కొత్త చిత్రం ఆగస్ట్ 22న?

ఆ మధ్య ఆయన 'అధినాయకుడు' అనే సినిమాను చేస్తాడని కొంతకాలంగా ప్రచారం జరిగింది. కాని చిత్రంగా ఆ టైటిల్‌తో సినిమాను ఆయన సోదరుడు నాగబాబు చేస్తున్నారంటూ ట్విస్టు ఇచ్చారు. దాంతో చిరంజీవి సినిమా ఇప్పట్లో వుండదేమోననే సందేహాలు అందరిలో వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి సినిమా ఆగస్ట్ 22న ప్రారంభం కాబోతోంది. ఆరోజు చిరంజీవి పుట్టినరోజు. సినిమా నా దేశం లాంటి పొలిటికల్ ఎవేర్ నెస్ చిత్రమై ఉండవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టును ఇప్పటికే సిద్ధం చేశారుట. అయితే దర్శకుడి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది. దర్శకుడు ఎన్.శంకర్ రేస్ లో ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. యేదేమైనా చిరు అభిమానులకు మాత్రం ఈ వార్త సంతోషాన్ని కలిగించేదే.


Click it and Unblock the Notifications











