భిన్నంగా చిరుపార్టీ ఉంటేనే...
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాలని మొదటి నుంచి కోరుకుంటున్న పార్టీలు సిపియం, సిపిఐలు. ఈ రెండు పార్టీలలో సిపియం పార్టీ ముందుంది. సిపియం కార్యదర్శి రాఘవులు, చాలా కాలం క్రితమే చిరంజీవితో సమావేశమైనట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇపుడు కూడా రాఘవులు చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు. అయితే చిరంజీవే ఇంకా స్పందించలేదని అన్నాడు. ఉన్న పార్టీలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసే ఉద్ధేశంతో చిరంజీవి రాజకీయాలలోకి వస్తే తమ మద్ధతు కచ్చితంగా చిరంజీవికి ఉంటుందిని ఆయన మీడియాతో అన్నారు. అలా కాకుండా రంగంలో ఉన్న రాజకీయ పార్టీల మాదిరిగా పార్టీ పెడితే మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదని, అలా ఇవ్వడంలో అర్థం లేదని అన్నారు. అలా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే పెద్దగా ప్రభావం కూడా ఉండదని రాఘవులు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











