"చిరు పార్టీ పెడితే టిడిపికి నష్టం లేదు"
చిరంజీవి పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీకి వచ్చే సమస్యేమీలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజల మన్ననలు పొందిందని, 2009 ఎన్నికలలో కచ్చితంగా గెలుస్తామని శ్రీహరి ధీమా వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ చిరంజీవి పార్టీ పెడతారనే వార్త రాజకీయపార్టీలకు నిద్రలేకుండా చేస్తోందని, ఇందులో ఎంత మాత్రం సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











