మోడీ గెలిస్తే చిరు పార్టీ ఇప్పట్లో లేనట్టే!!!
చిరంజీవి ఈనెల 23 తరువాత రాజకీయాలలోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 23న గుజరాత్ ఎన్నికల ఫలితాలు రానున్నందున వాటి తరువాతే చిరంజీవి ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. గుజరాత్ ఫలితాల తరువాత రాజకీయాలలో నెలకొన్న అనిశ్చితి తొలిగే అవకాశాలు మెండుగా ఉన్నందున అపుడే ప్రకటిస్తే బావుంటందని చిరు సన్నిహితుల ఆలోచనట. గుజరాత్ లో బిజెపి కనుక గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యంతరానికి వెళ్లే ధైర్యం చేయదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మధ్యంతరానికి ఆ పార్టీ సై అనే అవకాశాలు ఉన్నాయి. అపుడు చిరంజీవి కూడా రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటుందని ఆలోచన. మరి మోడీ గెలిస్తే చిరంజీవి తన పార్టీని ప్రకటించే అంశాన్ని వాయిదా వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యంతరం రాని పక్షంలో ఇపుడే పార్టీ ప్రకటించి చేసేదేమి ఉండదు కనుక చిరంజీవి మరో రెండు సినిమాలలో నటించి 150 సినిమాల మార్కును తాకే అవకాశం ఉంది. అంతా మోడీ మీద ఆధారపడి ఉందన్న మాట.


Click it and Unblock the Notifications











