»   » మెగాస్టార్-సూపర్ స్టార్-కలెక్షన్ కింగ్ ల సరదా చలోక్తుల మధ్య 'రోబో'

మెగాస్టార్-సూపర్ స్టార్-కలెక్షన్ కింగ్ ల సరదా చలోక్తుల మధ్య 'రోబో'

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో తెలుగు వెర్షన్ ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో జరిగింది. రజనీ స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వచ్చారు. రజనీ ఆప్తమిత్రుడు మోహన్ బాబు విశిష్ట అతిథిగా విచ్చేశారు. వీరి కాంబినేషన్ అంటేనే క్రేజ్. ఆడియో ఫంక్షన్ చాలా సరదాగా సాగింది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఆహ్లాదాన్ని పంచారు.

మోహన్ బాబు మాట్లాడుతూ... వీడు.. అంటూ రజనీని సంబోధిస్తే.. 'వీరు" అని గౌరవం ఇవ్వాలని చిరంజీవి అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వారు. రజనీ మాట్లాడుతూ... ఎక్స్ ఎంపీ... ఎక్స్ హీరో.. అంటూ మోహన్ బాబును సంబోధిస్తుంటే.. మోహన్ బాబు చిరునవ్వులు నవ్వుతూ మైక్ అందుకోబోయి ఏదో చెప్పగానే.. దట్సాల్ అంటూ రజనీ ముగించారు.

చిరంజీవి మాట్లాడుతూ... ప్లీజ్. ఒక్క ఛాన్స్ అంటూ.. శంకర్‌ను ప్రాధేయపడ్డారు. శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుందని చెప్పారు. దీనికి మోహన్ బాబు సీరియస్‌ గా చూస్తుండటంతో.. చూశారా... నేను ఎంత సరదాగా మాట్లాడుతుంటే... ఎంత సీరియస్‌ గా చూస్తున్నాడో.. అంటూ మోహన్ బాబును ఉద్దేశించి అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu