రామ్ గోపాల్ వర్మ చిరుతో కామిడి చేయట్లేదు కాదా...
చిరంజీవి హీరోగా 'దొర" అనే టైటిల్ తో సినిమా తీయాలని ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నాడు. గతంలో అశ్విని దత్ నిర్మాతగా, వైజయంత్ బ్యానర్ లో చిరంజీవితో సినిమా చేయడానికి మొదలుపెట్టి చిరు -రామ్ కి కొన్ని అభిప్రాయాలు కుదరకపోవడంతో దానిని మధ్యలోనే వదిలిపెట్టి పోయిన వర్మ ఇప్పుడే మొహం పెట్టుకుని చిరంజీవి దగ్గరకు వెళ్లాలో తెలీడం లేదని అన్నాడు. సడన్ గా ఈ టైటిల్ కి వర్మ నిజంగానే చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాడో లేదో అనేది తెలీదు కానీ అతను ఎందుకో కామెడీకి ఈ ప్రకటన చేశాడనే అనుమానమూ కలగక మానదు.
'దొర" అనే టైటిల్ ఎలా ఉన్నా కానీ, 'ది లార్డ్" అనే క్యాప్షన్ మాత్రం చాలా కామెడీగా, వెటకారంగా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అసలే మెగాస్టార్ గురించి మాట్లాడినప్పుడల్లా వ్యంగ్యంగా సమాధానమిచ్చే రామ్ గోపాల్ వర్మ నిజంగానే చిరుతో సినిమా చేయాలనుకుంటున్నాడో లేక సరదాకి ఇలా స్టేట్ మెంట్ ఇచ్చాడో తెలీదు మరి. 'దొర" అయ్యేందుకు చిరంజీవి ఇష్టపడతాడో లేదో అనేది కాలమే చెప్పాలి..


Click it and Unblock the Notifications











