Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాస్టార్ తెగ ముద్దొస్తున్నాడంటూ మెగాభిమానులంతా మురిసిపోతున్నారు...
రాజకీయాల్లోకొచ్చి మెగాస్టార్ చిరంజీవి కోట్లు కూడబెట్టాడో లేదో మనకు తెలియదు కానీ..కేలరీల కొద్దీ కొవ్వును మాత్రం ఒంటబట్టించుకున్నాడు. సినిమా నటించేటప్పుడు పాటల రూపంలో హీరోయిన్స్ తో చేసే 'ఎక్సర్ సైజులు" లేక, రాజకీలయాల్లోకొచ్చాక చిరు బాడీ సైజు బీభత్సంగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల వరకూ, అంటే..మరో నాలుగు సంవత్సరాలు ప్రజారాజ్యం పార్టీ ఉనికిని, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి సినిమాల్లో నటించడం మినహా మరో మార్గం లేకపోవడంతోపాటు, '150వ చిత్రం" అనే ల్యాండ్ మార్క్ కు ఒకే ఒక్క చిత్రం దూరంలో ఉండిపోవడం ఇష్టం లేని చిరంజీవి మళ్లీ ముఖానికి రంగేసుకోవాల్సిందేనంటూ నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పుడున్న పర్సనాలిటీతో సినిమాలో నటిస్తే..దానికి ఏమాత్రం క్రేజ్ రాదని గ్రహించిన చిరంజీవి లిపోసక్షన్ అనే సర్జరీ ద్వారా తన ఒంటిలో పేరుకుపోయిన కొవ్వునంతట్నీ కరిగించేసుకున్నారు. దాంతో మునుపటి చిరంజీవిలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్న చిరంజీవిని చూసి మెగాభిమానులంతా మురిసిపోతున్నారంట. రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం 'ఆరంజ్" ఆడియో ఫంక్షన్ లో చిరు 150వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.