పుకారు నిజమైంది: చిరంజీవి చిన్న అల్లుడు కూడా..., తెరవెనక సాయి కొర్రపాటి!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు వివాహం గతేడాది వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడైన కళ్యాణ్‌ను ఆమె పెళ్లాడారు. కళ్యాణ్ లుక్ పరంగా, పిజిక్ పరంగా హీరో పర్సనాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో.... ఈ కుర్రాడు కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.
ఇన్నాళ్లు ఒక పుకారుగానే ఉన్న ఈ వార్త ఇపుడు నిజం కాబోతోంది. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ త్వరలో సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినిమా కూడా ఖరారైంది.

దర్శకత్వం ఎవరు?
కళ్యాణ్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇంతకు ముందు ‘జతకలిసే' అనే సినిమా చేశారు. ప్రేమకథా చిత్రంతో కళ్యాణ్ హీరోగా పరిచయం కాబోతున్నారట.

రంగంలోకి సాయి కొర్రపాటి?
వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ
కళ్యాణ్ యాక్టింగ్, డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, వరుణ్ తేజ్ లకు శిక్షణ ఇచ్చిన ‘స్టార్ మేకర్' సత్యానంద్ వద్దే కళ్యాణ్ కూడా శిక్షణ తీసుకున్నారట.

లాంచింగ్ ఎప్పుడు?
కళ్యాణ్ హీరోగా సినిమా ఎప్పుడు లాంచ్ కాబోతోంది అనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే వారాహి చలన చిత్రం బేనర్ నుండి ఈ సినిమా విషయమై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

చిరంజీవి ఫ్యామిలీ నుండి
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక యాక్టింగ్ కెరీర్లో ఉన్నారు. ఈ లిస్టులో ఇపుడు శ్రీజ భర్త కళ్యాణ్ కూడా చేరబోతున్నారు.


Click it and Unblock the Notifications











