చెన్నై లొకేషన్లలో చిరంజీవి-త్రిష
చిరంజీవి స్టాలిన్ చిత్రం గత రెండు వారాలుగా చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మురుగదాస్‌కు ఇష్టమైన ఎవిఎం స్టూడియో, మాయాజాల్ కాంప్లెక్స్, బిన్నీ మిల్స్ కాంపౌండ్‌లలో షూటింగ్ జరుగుతోంది. ఈ లొకేషన్లలో చిరంజీవిని చూడడానికి చెన్నైలోని ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. స్టాలిన్ చిత్రీకరణ ఇప్పటికి మూడో వంతు పూర్తయింది. మాయాజాల్‌లో చిరంజీవి, త్రిష మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు చిరంజీవిని కలుసుకుని సన్మాన కార్యక్రమాలకు రావలసిందిగా ఆహ్వానించారు. ఇలా ఉండగా ఈనెల తొమ్మిదిన చిరంజీవిని యావత్ తెలుగు సినిమా సన్మానించనుంది. ఆ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.


Click it and Unblock the Notifications