పాపులర్ అయిన గూగుల్ సెర్చ్ లో భారత్ లో ఎక్కువ మంది చూస్తున్న పొలిటికల్ నాయకుడుగా చిరంజివి మొదటి ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం. ఇక రెండో ప్లేస్ లో ఎల్.కె.అద్వానీ నిలవగా మూడవ ప్లేస్ లో మన్మోహన్ సింగ్ వస్తున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపధ్యంలో చిరంజీవిపైనా, ఆయన ప్రజారాజ్యం పార్టీపైనా వచ్చే వార్తలకు వెబ్ లో బాగా ప్రాముఖ్యత పెరిగింది. చిరంజీవి మెగాస్టార్ కావటం, కొత్తగా పార్టీ పెట్టడం, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగబాబు వంటి సినీ స్టార్స్ పార్టీలో ఉండటం, రోజు వారి కాంట్రావర్శీలు, సెర్చ్ లో చిరంజీవి స్ధానాన్ని మొదటి ప్లేస్ లో ఉంచటానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.