‘చిరు’ ఫార్ములా ఫాలోఅయిన ‘మహేష్ ఖలేజా’
ఏదైనా టైటిల్ విషయంలో పేచీ ఎదురైతే సినిమా వాళ్ళు దానిని వీలయినంత సామరస్యంగా పరిష్యరించుకోవడానికి ప్రయత్నిస్తారు. టైటిల్ రైట్స్ కోసం రాజీ ధోరణిలోనే వ్యవహరిస్తుంటారు. అవతలి వ్యక్తి రీజనబుల్ రేట్ అడిగితే అదిచ్చి టైటిల్ రైట్స్ సొంతం చేసుకోవాడానికి వెనుకాడరు. అయితే ఒక్కోసారి సదరు టైటిల్ హక్కుదారులు అత్యాశకు పోయి చిరాకు పెడుతుంటారు. కొనడానికి వీలు కాని రేటు చెప్పి విసిగిస్తారు.
అలాంటి టైమ్ లోనే టైటిల్ ముందు హీరో పేరు చేర్చి కొత్తగా దానిని రిజిష్టర్ చేయించి కార్యం కానిచ్చేస్తారు. ఉదాహిరణకి చిరంజీవి సినిమా 'హిట్లర్" నే తీసుకుంటే ఆ టైటిల్ విషయంలో అప్పట్టో వివాదం చెలరేగిండి అప్పుడు 'హిట్లర్" ముందు చిరంజీవి పేరు చేర్చి, చిరంజీవి అన్నది కనీ కనిపించకుండా రాసి లోగో తయారు చేయించి రీలీజ్ చేసేశారు. నిజానికది 'చిరంజీవి హిట్లర్" అయినా కానీ ప్రేక్షకులు మాత్రం 'హిట్లర్" అనే అంటారు. ఇలాంటివి మరికొన్ని సినిమాలకి కూడా జరిగాయి.
ఇప్పుడు 'ఖలేజా" టైటిల్ హక్కుదారుడితో విపరీతమైన పేచీ ఎదుర్కొంటున్న మహేష్, త్రివిక్రమ్ లు కూడా సేమ్ ఫార్ములా అప్లయ్ చేసి, రెచ్చిపోతున్న సదరు నిర్మాత తోక కత్తిరించారు. 'ఖలేజా" ముందు మహేష్ పేరు జత చేసేసి కొత్త లోగో రెడీ చేయించారు. దాంతో 'ఖలేజా" కాస్తా 'మహేష్ ఖలేజా" అనే ప్రచారంలో ఉంటుంది. అలా చిరు చిట్కాతో ఖలేజా టైటిల్ ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











