ఆటా సదస్సుకు చిరంజీవి
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సమావేశాలకు హీరో చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఆటా తొమ్మిదో మహాసభలు కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో జూన్ 30 నుంచి జులై రెండో తేదీ వరకు జరుగనున్నాయి. సినిమా నటులు లేకుండా విదేశాల్లోని తెలుగు సంఘాల సమావేశాలు విజయవంతం కావు. అందువల్లనే ప్రవాస తెలుగు సంఘాలు సినిమా నటులను, సినిమా పాట కచేరీలను విస్మరించరు. ఈ ఆటా సమావేశాలకు చిరంజీవితో పాటు టబు, రవితేజా, శ్రీకాంత్, అలీ, సునీల్, శివారెడ్డి హాజరు కానున్నారు. మణిశర్మ నిర్వహించే మూజికల్ నైట్‌లో విజయలక్ష్మి, హేమచంద్ర, గంగాధర్ పాల్గొంటారు. ఆటా ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications