ఎన్టీఆర్ పరామర్శ ఎందుకంటే..చిరు

అలాగే యాక్సిడెంట్ జరిగిన రోజునే ఎన్టీఆర్ గురించి ఆయన తల్లి షాలినిని అడిగి తెలుసుకున్నానని, ఎన్టీఆర్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని చెప్పారు. అనంతరం అల్లు అరవింద్, సినీనటులు బాలకృష్ణ, వేణుమాధవ్, దర్శకుడు వీవీ వినాయక్, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ లు జూనియర్ ఎన్టీఆర్‌ను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించామని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ అదుపులో ఉందని కిమ్స్ సీఈవో డాక్టర్ భాస్కరరావు తెలిపారు.
బుధవారం నుంచి ఎన్టీఆర్ తనకు తానే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నామన్నారు. మరో నాలుగు రోజుల తర్వాత పూర్తి వైద్యపరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు ఆరోగ్య పరిస్థితి మెరుగనిపిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ను కూర్చోబెట్టేందుకు, నడిపించేందుకు ప్రయత్నం చేయిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేస్తూ చిరంజీవి వివరణ ఇవ్వటం అందరినీ ఆలోచింపచేసింది.


Click it and Unblock the Notifications











