చిరు కోరికపై కమెడియిన్ అలీ మరోసారి
రామ్ చరణ్, ఉపాసన వివాహం జూన్ 14న జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మెగా వివాహ వేడుకకు పలువురు భారతీయ సినీ ప్రముఖులు, జాతీయ స్థాయి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. దాంతో మెగా ఫ్యామిలీ ఈ వేడుకను నభూతో న భవిష్యతి అన్నట్లుగా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా జరిగే సంగీత్ లో అల్లు అర్జున్, తమన్నా,శ్రియా శరన్ డాన్స్ చేయబోతున్నారని తెలిసిందే.
అయితే ఇప్పుడు చిరంజీవి..హాస్య నటుడు అలీ తో కజిరారే పాటను చేయించాలని నిర్ణయించారని సమాచారం. గతంలో చిరంజీవి కుమార్తె వివాహ సమయంలో అలీ ఈ పాటకు చేసిన డాన్స్ అప్పట్లో టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దాంతో ఇప్పుడు అదే తరహాలో అలీ తో చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంగీత్ మొత్తం జూన్ 11 న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. టాలీవుడ్ లోని ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఇక ఈ వివాహ వేడుకకి అందరికీ ఆహ్వానం లేదు. కేవలం తమ కుటుంబాలకు ముఖ్యమైన అతిధులను,స్నేహితులను,సన్నిహితులను,శ్రేయాభిలాషులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. రామ్ చరణ్ వివాహం కోసం తన షూటింగ్ లకు లాంగ్ గ్యాప్ ఇవ్వనున్నారు. వివాహం అయిన పదిహేను రోజులు తర్వాత షూటింగ్ లో పాల్గొంటారు.
చరణ్-ఉపాసన వివాహం మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఉపాసన ఫాంహౌస్‌లో జరుగబోతోంది. పెళ్లికి కేవలం చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎంపిక చేయబడ్డ సినీ, రాజకీయ ప్రముఖులు, వివిఐపిలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఎంట్రీ కోసం ఎలక్ట్రానిక్ పాస్‌లను ప్రవేశ పెట్టారు. సాధారణ జనాలకు, అభిమానులకు ఈ వేడుకలో చోటు లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానుల కోసం పెళ్లి మరుసటి రోజు హైదరాబాద్‌లో భారీ విందుకు ఏర్పాటు చేసినట్లు చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











