శ్రీజ గురించి: యూట్యూబులో చిరు ఇంటర్వ్యూ కలకలం!

By Bojja Kumar

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది. వీరిద్దకీ కోర్టు ఇటీవల విడాకులు కూడా మంజూరు చేసింది. వీరికి పుట్టిన పాప ఆలనా పాలన కోర్టు శ్రీజకే అప్పగించినట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం శ్రీజ అమెరికాకు వెళ్లాలనే ఆలోచనలో ఉందని, అక్కడ మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టాలనే ప్లాన్లో ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

శ్రీజ గతంలలో హైదరాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్త శిరీష్ భరద్వాజ్ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చాలా స్ట్రాంగ్ గా కేసుపెట్టింది. దీంతో భరద్వాజ్ నీ, అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలం తర్వాత శిరీష్ భరద్వాజ్ బెయిల్ పై విడుదల అయ్యారు.

Chiru warned TV anchor for Srija

గత కొంత కాలంగా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు వీరు మళ్లీ కలిసుండాలని చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో విడాకులు మంజూరు చేసింది. కలిసి ఉండటానికి శ్రీజ, భరద్వాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖత చూపలేదని, వాడాకులు కావాలనే విషయంలో ఇద్దరూ స్ట్రాంగ్‌గా ఉండటంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

కాగా...తాజాగా యూట్యూబులో ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. చిరంజీవి ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియోలో.... మీ చిన్న కూతురు శ్రీజను మీరు ఎందుకు కలుపుకోలేకపోతున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీకు అవసరమా..? మేము కలుపుకోలేదని మీకు తెలుసా.. ఈ ప్రశ్న డిలెట్ చేయండి.. ఎన్నిసార్లు అడుగుతారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు చిరు.

చాలా కాలం క్రిందటి ఈ వీడియోను.... ఎవరో కావాలని 5 మార్చి, 2014న మళ్లీ ఫ్రెష్‌గా అప్ లోడ్ చేసారు. పైగా ఈ యూట్యూబ్ అకౌంటుకు 'పవన్ కళ్యాణ్ లేటెస్ట్ న్యూస్' అనే పేరు ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం పెట్టి ఈ వీడియో సోషల్ నెట్వర్కింగుల్లో షేర్ అవుతుండటంతో వేగంగా స్ప్రెడ్ అవుతోంది. అప్పుడే దీనికి లక్షకుపైగా హిట్స్ రావడం గమనార్హం. మరి ఈ వీడియోను ఇపుడు ఎందుకు తెరపైకి తెచ్చారు? అనేది అంతు పట్టడం లేదు. సోషల్ నెట్వర్కింగులో కలకలం సృష్టిస్తున్న ఈ వీడియో ఉదంతాన్ని పాఠకుల దృష్టికి తెచ్చే ప్రత్నమే ఈ ఆర్టికల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X