»   » మెగా హీరోల మనోభావాలను దెబ్బతీస్తే...

మెగా హీరోల మనోభావాలను దెబ్బతీస్తే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగా హీరోల సినిమాలను విడుదల కాకుండా ఆపితే చూస్తూ వూరుకోబోమని 'చిరంజీవి యువత' పేర్కొంది. సినిమాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకారుల పేరిట మా హీరోల బొమ్మలు తగలబెడితే సహించబోమని, కుటిల రాజకీయాలను తిప్పికొడతామని హెచ్చరించారు.


అలాగే తెదేపా శాసనసభ్యుడు దేవినేని ఉమమహేశ్వరరావు మొదటి నుంచీ చిరంజీవిపై వ్యక్తిగత కక్షతో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మెగా హీరోలపై తాము చూపే అభిమానానికి సరిహద్దులు, ప్రాంతాలు, పార్టీలు లేవని, అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు.

మరో ప్రక్క పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రంలోని ఉద్యమ జేఏసీలకు హెచ్చరికలు జారీ చేసారు. ఈ మేరకు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఉద్యమకారులకు సందేశాలు పంపుతున్నారు. మా హీరో జోలికి రావొద్దు...సినిమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

'రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కొన్ని జేఏసీలు మా హీరో నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారందరికీ ఒకటే హెచ్చరిక. మా సినిమా జోలికి రావొద్దు. అలాంటి ఏమైనా జరిగితే మా తడాఖా చూపిస్తాం. మా జోలిక రావొద్దు ఖబడ్దార్' అంటూ హెచ్చరికలు జారీ చేసారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అందుకే మేము మొదటి నుంచి అటు తెలంగాణ ఉద్యమానికి గానీ, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్టు చేయడం లేదు. కానీ మా హీరో జోలికి వస్తే కేవీపీ అయినా, కావూరి అయినా లేదా కేసీఆర్ అయినా లెక్కచేయమని స్పష్టం చేసారు.

English summary
Samaikyandhra JAC warned that they shall stall the releases of Chiranjeevi's family members' films - Attaraintiki Daredi and Yevadu, if the actor-turned politician does not resign from his position and join the Samaikyandhra movement. This is due to the JAC Warned by Swami Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu