త్రిష-జీవా ‘చిరునవ్వుల చిరుజల్లు’ (ట్రైలర్)

By Bojja Kumar

హైదరాబాద్: జీవా-త్రిష జంటగా రూపొంది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రం తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు' టైటిల్ తో అనువాదమవుతుండటం తెలిసిందే. మాస్టర్ ఎం.డి.రౌత్ సమర్పణలో ఆర్.ఎ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.

Chirunavvula Chirujallu Theatrical Trailer

ఈ సందర్భంగా నిర్మాత జాని మాట్లాడుతూ...‘మిర్చి, రన్ రాజా రన్ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన మది సినిమాటోగ్రఫీ, హేరిస్ జైరాజ్ మ్యూజిక్, త్రిష-ఆండ్రియా గ్లామర్, జీవా, వినయ్(వాన ఫేం), నాజర్ పెర్ఫార్మెన్స్, సంతానం కామెడీ చిరునవ్వుల చిరుజల్లు చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు నిర్మాత జాని. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, సంగీతం: హేరిస్ జైరాజ్, నిర్మాత: జాని, దర్శకత్వం: ఐ.అహ్మద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X