చిరు కోసం చిరుశ్రీ నిరాహారదీక్ష???
చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ర్యాలీలు, సభలు జరుపుతుంటే పామర్రు అభిమాని అందరిని ఆకర్షించే కార్యక్రమానికి పూనుకున్నాడు. పామర్రుకు చెందిన ముద్దినేని దుర్గానాయుడు అనే అభిమాని తన నాలుగేళ్ల కూతురుతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నాడు. చిరంజీవి త్వరగా రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు పూనుకుంటున్నారు. ఈ దీక్ష శనివారం నుంచి ప్రారంభం కానున్నది. దుర్గానాయుడు నాలుగేళ్ల కూతురు పేరు చిరుశ్రీ. చిరుశ్రీ నిరాహార దీక్షకు కూర్చోనున్నది. పోలీసులు అనుమతి ఇచ్చారో లేదో తెలియదు కానీ తండ్రీ కూతురు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. మరి చిరంజీవి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











