చిరుత శతదినోత్సవానికి పవన్ కళ్యాణ్!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమా చిరుత 100 రోజుల గమ్యానికి దరి చేరింది. ఇప్పిటికే 86వ మైలురాయిని చేరుకుంది. కొద్ది రోజుల్లో వందరోజులు పూర్తికావడం ఖాయం కనుక ఈ సినిమా శతదినోత్సవాన్ని ఎక్కడ జరపాలన్న అంశం చర్చకు వస్తోంది. ఎందుకంటే అర్థ శతదినోత్సవం సింగపూర్ లో జరిగింది. శతదినోత్సవం ఇంకే దేశంలో జరుగుతుందోననే అనుమానం అభిమానులకు సహజంగానే కలుగుతుంది. అభిమానులు సంతోషించదగ్గ అంశమేమంటే చిరుత శతదినోత్సవాన్ని విశాఖపట్టణంలో జరపడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ ఉత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం జనవరి మొదటి వారంలో ప్రకటించనున్నారు. విశాఖపట్టణంలో ఈ సినిమా ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ గా నడుస్తుండడం వలనననే అక్కడే శతదినోత్సవాన్ని జరపడానికి కారణమని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











