హైదరాబాద్ లో చిరుత బిజినెస్!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ తెరంగేట్రం చేసిన సినిమా చిరుత నాలుగవ వారాన్ని పూర్తి చేసుకోబోతోంది. హైదరాబాద్ నగరంలో 4వ వారంలో 20 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. చాపకింద నీరులా విజయం సాధిస్తున్న హ్యాపీడేస్ మూడోవారాన్ని పూర్తిచేసుకోబోతోంది. హ్యాపీడేస్ సినిమా హైదరాబాద్ లో 15 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. నాలుగవ వారంలో మరో 4 థియేటర్లలో విడుదల కాబోతోంది. కాగా చిరుత సినిమా విడుదలైన ప్రధాన థియేటర్ సుదర్శన్ 70ఎమ్ఎమ్ లో ఇప్పటికి రూ.32,34,404ను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











