twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి సినిమాలోనూ చేసాను...ఫణి ప్రకాష్ (ఇన్నర్వూ)

    By Srikanya
    |

    "తృప్తి కోసం నాటకం..భుక్తి కోసం సినిమా" అంటున్నారు ఫణి ప్రకాష్.'సుందరానికి తొందరెక్కువ' (2005)చిత్రంతో పరిచయం అయిన ఫణిప్రకాష్ నాటకంతో చిననాటి నుంచి పెంచుకున్న అనుభంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పు కొచ్చారు.ఆరవ ఏటనే ...రాళ్ళపల్లి గారి 'ముగింపు లేని కథ' నాటకం తో స్టేజి ఎక్కిన ఫణి ప్రకాష్ తో ధట్స్ తెలుగు చిట్ చాట్:

    తణికెళ్ళ భరిణి గారితో మీరు చాలా నాటకాలు వేసినట్లున్నారు...
    అవును...మామయ్య(భరణి)తో నేను చాలా నాటకాలు వేసాను.ఆయన రచించి,నటించిన జంబూ ద్వీపం,గో గ్రహణం, గార్భభాండం, ఛల్ ఛల్ గుర్రం లలో నాది మెయిన్ క్యారెక్టర్. అలాగే మరో సినీ రచయిత శంకరమంచి పార్ధ సారిధి రచనలు దొంగల బండి, ప్రసన్నకు ప్రేమతో, హళ్ళికి హళ్ళి, సైలెన్స్ ప్లీజ్, అబ్బే ఏం లేదు నాటకాలన్నిటిలో నాది కీ రోల్.ఎల్బీ శ్రీరామ్,కోట శ్రీనివాసరావు లతో చాలా నాటకాలు వేసాను.

    సినీ ప్రవేశం గురించి..
    శివ నాగేశ్వరరావు గారి వన్స్ మోర్ చిత్రంతో ప్రవేశం. ఆ తర్వాత ఓ పనైపోతుంది బాబు, రమణ చిత్రాలు చేసారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, కోదండరామిరెడ్డిగారి ఒకటో నెంబర్ కుర్రాడు, గ్రహణం(నేషనల్ అవార్డు చిత్రం)కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్, కాస్టింగ్ డైరక్టర్ గా చేసాను.ఇంకా ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, కుబేరులు వంటి కామిడీ చిత్రాలలో నటించి స్క్రిప్టు సహకారం అందించాను.

    ఇప్పుడు ఎందుకుని నటుడుగా ఆఫర్స్ రావటం లేదంటారు?
    నేను దర్సకుడునీ కావటంతో చాలా మంది నేను నటుడుగా మళ్ళీ వస్తాడో రాడో...ఒక వేళ వచ్చినా దర్సకుడుగా నాలో ఉన్న టింజ్ ని ప్రదర్శిస్తారన్న భయం అయ్యిండచ్చుని నా అనుమానం. నేను ముందు నటుడ్ని...ఆ తర్వతే దర్శకుడుని.

    టీవీ సైడ్ వెళ్ళలేదా?
    సందడే సందడి(జీ తెలుగులో వచ్చిన సీరియల్ )కి డైరక్ట్ చేసాను.

    మీ మొదటి చిత్రం ఫెయిల్యూర్ కారణం?
    'సుందరానికి తొందరెక్కువ' మొదలెట్టినప్పుడు కొంతమంది నటులుతో అనుకున్నప్పుడు...తెరకెక్కేసరికి నటులు మారిపోవటం, బడ్జెట్ తగ్గిపోవటం.ఊహించని ఆర్ధిక సమస్యలు...

    నిర్మాతతో తగువయ్యిందా?
    లేదు..లేదు..ప్రొడ్యూసర్ దేముడే...సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన చాలా క్యాజువల్ గా...హిట్..ఫెయిల్యూర్ లు .. లాభ,నష్టాలు ప్రక్కన పెడితే మంచి సినిమా తీసానన్న తృప్తి మిగిలిందన్నాడు.ఈ రోజుకీ టీవిలో 'సుందరానికి తొందరెక్కువ'సినిమా వేసినప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తారు.

    దర్సకుడుగా ఇంత గ్యాప్ రావటానికి కారణం?
    నా మొదటి సినిమా సినీ రంగానికి ఫెయిల్యూర్ కనుక..

    నేర్చుకున్న పాఠం..
    ఎంత గొప్ప సినిమా తీసినా అమ్ముకోవటం చేతకాకపోతే అది ప్రొడక్టు స్ధాయిలోనే ఫ్లాప్ అని..

    ఈ సారైనా హిట్టు ఇస్తారని ఎట్లా నమ్మాలి?
    చేసుకున్న కథ,ఈ గ్యాప్ లో సంపాదించుకున్న అనుభవం రెండూ కలిసి నాకు హిట్టిస్తాయని నాకు నమ్మకం.అందుకే సినిమా తీసేవాడు కావాలి..మోసేవాడు కావాలని వెతుక్కుంటున్నా.గ్యాప్ కి అదే కారణం.

    ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్ధితిపై కామెంట్..
    పూర్తి మన రాష్ట్ర పరిస్ధితిలా ఉంది.

    భవిష్యత్ ఆలోచన...
    కొంచెం సెటిలయిన తర్వాత మళ్ళీ నాటకాలను తీసుకుని మంచి నటులను తయారు చేసి ఇక్కడా మంచి నటులే ఉన్నారు. ప్రక్క రాష్టాలకు పరుగెత్తక్కర్లేదని చెప్పాలని.

    ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
    యవనిక పేరుతో ప్రముఖుల నాటకాలను ఈ తరానికి పరచయం చేయటానికి వాటిని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాను.అలాగే
    సినిమా దర్శకత్వం చేయటానికి కథ ప్రిపేర్ చేసుకుని అందరినీ కలుస్తున్నాను.ఎట్ ద సేమ్ టైమ్ మంచి పాత్ర వస్తే నటుడుగా కొనసాగాలని ఆకాంక్ష.తృప్తి కోసం నాటకం..భుక్తి కోసం సినిమా.

    అంటూ ఈ రోజు తను ఇలా నిలబడటానకి కారణం తన గురువు సుందరం గారంటూ ముగించారు.ఆయనకు మంచి ఆఫర్స్ రావాలని,మళ్ళీ బిజీ కావాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.అలాగే ఆయన్ను నటుడుగా సంప్రదించాలనుకునేవారు...9849179607

    English summary
    Director And Actor Phani Prakash wants to busy in acting. He expressed his desire to direct a comedy film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X