ఎన్నాళ్లు హీరోయిన్ల చుట్టూ పరుగెత్తాలి: నాగ్
''ఇకెంతకాలం హీరోయిన్ల చుట్టూ పరుగెత్తాలి, అందుకే వయసుకు తగిన సినిమాలు ఎంచుకుంటున్నాను. రాజన్న ఆ తరహాలోనిదే. ఇంతకు ముందు గగనం సినిమా కూడా ఓ డిఫరెంట్, నా వయసు తగిన సినిమా''...రాజన్న సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి.
రాజన్న సినిమా స్ర్కిప్టు చాలా బాగా నచ్చింది కాబట్టే నేనే ప్రొడ్యూస్ చేయడానికి నిర్ణయించుకున్నాను. విజయేంద్రప్రసాద్ పదేళ్లు కష్టపడి ఆ స్ర్కిప్టు తయారు చేసుకున్నారు. రాజమౌళి అడిగినా ఇవ్వకుండా తానే స్వయంగా డైరెక్షన్ చేయడానికి నిర్ణయించుకున్నారు. సినిమా మొత్తం బేబీ ఆని చుట్టు తిరుగుతుంది. ఆ పాప నటన అద్భుతం. కానీ మేము ఇద్దరం కలిసి నటించే సన్నివేశాలు లేవు. ఒక సందర్భంలో అంత బాగా నటించే పాపతో కలిసి నటించే అవకాశం దక్కలేదనే అని బాధ పడ్డాను అని నాగార్జున చెప్పుకొచ్చారు.
రాజమౌళితో కలిసి చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ అనుకోకుండా రాజన్న సినిమాతో మా కాంబినేషన్ కలిసింది. ఆయన ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్ డైరెక్ట్ చేశారు అని నాగార్జున చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











