Just In
- 2 hrs ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- 3 hrs ago
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
- 3 hrs ago
సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!
- 4 hrs ago
ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- News
మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు... ఈసారి కేటాయింపులు ఎక్కువే... : సీఎం కేసీఆర్
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Lifestyle
Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...
- Automobiles
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్
2020లో ఎంతో మంది తారలు స్వర్గస్తులయ్యారు. 2020 చిత్ర సీమకు కలిసి రాలేదు. ఓ వైపు కరోనా,లాక్డౌన్‌తో పరిశ్రమ ఆర్థికంగా నష్టపోయింది.. మరో వైపు అద్భుతమైన నటులు మరణించారు. అలా ఏడాది చివరి రోజులు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. తెలుగు సినిమాలో భయంకరమైన విలనిజాన్ని పండించారు.. అదే సమయంలో కామెడీతోనూ అందరినీ నవ్వించారు. ఆయన మరణం తీరని లోటు. నర్సింగ్ యాదర్ సతీమణి చిత్ర తాజాగా మీడియాతో ముచ్చటించారు.
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

ఎన్నో విషయాలు..
నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర ఎన్నో విషయాల గురించి చెప్పింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు కానీ తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది. తన కోసం మూడేళ్లు ఎదురుచూశాడని, ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించాడని చివరకు అందరి సమక్షంలోనే పెళ్లి జరిగిందని చిత్ర చెప్పుకొచ్చింది.

ఆ విషయం నచ్చుతుంది..
నర్సింగ్ యాదవ్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వమని చిత్ర చెప్పుకొచ్చింది. ఎవరేం చెప్పినా నమ్మేస్తారు.. ఆయలనో నాకు నచ్చింది నమ్మకం. నా మీద పోట్టుకున్న నమ్మకం. చివరకు నమ్మకాన్ని సజీవంగా ఉంచారంటూ చిత్ర ఎమోషనల్ అయింది.

అలా పిలిచే వారు..
చిత్రా చిత్రా అంటూ రోజుకు లక్షసార్లు పిలిచేవాడట. తానంటే నర్సింగ్‌కు పంచ ప్రాణాలని చిత్ర చెప్పుకొచ్చింది. అలా ఎప్పుడూ పిలుస్తుండటంతో తనకు విసుగొచ్చేదని కానీ అందులోని ప్రేమ వెంటనే అర్థమయ్యేదని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ నీ జపమే చేస్తాడని ఆడపడుచులు ఆటపట్టించేవారంటూ చిత్ర పేర్కొంది.

అలా అంటుండేవారు..
నర్సింగ్ ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతుండేవాడట. ఇలా మంచాన పడకుండా నటిస్తూనే తుది శ్వాస విడవాలని చెబుతూ ఉండేవారట. ఆఖరి రోజుల్లో కూడా నటించాలని ఎంతో తాపత్రయపడ్డారట. ఆరోగ్యం నయమైతే నటించాలని ఎంతో ఆశపడ్డాడంటూ చిత్ర చెప్పుకొచ్చింది.

కోరిక తీరకుండానే..
కొద్దిగా ఆరోగ్యం నయమైతే మళ్లీ నటిస్తాననే వాడట. చివరకు ఆ కోరిక తీరకుండా వెళ్లిపోయాడని.. అది నాకు ఎక్కువగా బాధేస్తుందని చిత్ర చెప్పుకొచ్చింది. ఆయనకు నటనపై ఉన్న మక్కువ అలాంటిదని చిత్ర ఎమోషనల్ అయింది. వర్మను గురువులా, చిరంజీవిని ప్రాణంలా నర్సింగ్ ఆరాదిస్తాడని చిత్ర తెలిపింది.