భావోద్వేగానికి గురైన ఉదయ్ కిరణ్ భార్య (ఫోటోలు)
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన పాటలు విడుదల చేసారు.
పాటల సీడీని మల్టీ డైమెన్షన్ వాసు విడుదల చేసి తొలి కాపీని ఉదయ్‌కిరణ్ భార్య విషితకు అందజేశారు. ఈ సందర్భంగా విషిత భావోద్వేగానికి గురయ్యారు. జీవితంలో రియల్ హీరోగా ఎదిగిన ఉదయ్‌కిరణ్ చివరి చిత్రం ఇదని చెప్పడానికి బాధగా ఉందని, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తట్టుకోలేకపోతున్నామని విషిత అన్నారు.
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

విషితకు తొలి సీడీ
‘చిత్రం చెప్పిన కథ' ఆడియో రిలీజ్ సందర్భంగా తొలి సీడీ అందుకుంటున్న విషిత.

చిత్ర పటానికి
భౌతికంగా ఉదయ్ కిరణ్ లేక పోయినా...ఆయన ఉన్నట్లే అభిమానులు ఫీలయ్యారు. కుర్చీలో ఉదయ్ కిరణ్ ఫోటోకు పుష్పగుచ్చం అందించారు.

దర్శకుడు మాట్లాడుతూ..
చిత్ర దర్శకుడు మోహన్ మాట్లాడుతూ- ఉదయ్‌తో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చేసి ఇప్పుడు ఆయన లేరంటే బాధగా ఉందని, గత చిత్రాల్లో ఉన్నట్లుగా కాకుండా ఉదయ్‌కిరణ్ పాత్ర ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉంటుందని, ఆయనలో సరికొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడవచ్చని తెలిపారు.

చిత్రం చెప్పిన కథ
ఉదయ్‌కిరణ్‌కు పాటలమీద, సంగీతంమీద మంచి అవగాహన ఉందని, ఆయన అభిరుచికి తగినవిధంగా మంచి పాటలు అందించడానికి కృషి చేశానని మున్నా కాశి తెలిపారు. కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్, రఘు కుంచె, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











