కమెడియన్ చిత్రం శ్రీను హీరోగా నూతన చిత్రం

By Bojja Kumar

Chitram Srinu new movie
హైదరాబాద్: 250కి పైగా చిత్రాలతో తన నటనతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు చిత్రం శీను హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఐదుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుని, ప్రస్తుతం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాపించి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్నోవేటివ్ డైరెక్టర్ వివేక్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ పతాకంపై యం.శివశంకర్ (అపురూప్), గంప సిద్ధలక్ష్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జబర్ధస్త్ ఫేం రచ్చ రవి ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తుండగా, అఫ్సర్ అజాద్ విలన్ గా నటించనున్నారు. ఈ చిత్రం ఈ
నెలలోనే సెట్స్ మీదుకు వెళ్లనుంది.

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని, గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ చిత్రం చోటు సంపాదిస్తుందన్న ఆశాభావాన్ని దర్శకులు వివేక్స్ తెలిపారు. చిత్రం శ్రీను సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రానికి
కెమెరా: ఎం.ఎన్.రావ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాసింశెట్టి బాబి, నిర్మాతలు: యం.శివశంకర్ (అపురూప్), గంప సిద్ధలక్ష్మీ, కథ- స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: వివేక్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X