రాబోయే కాలంలో మరిన్ని ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తా..!
ముంబై: 'చిత్రాంగద సింగ్' ఈ పేరుని బాలీవుడ్‌లో చాలా సార్లు వినే ఉంటాం. కానీ మొదటి సారి ఓ ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలతో నర్తించిన పాట ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన 'జోకర్' అనే సినిమాలో 'చిత్రాంగద సింగ్ 'కాఫిరానా' అనే ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది.
ప్రస్తుతం చిత్రాంగద సింగ్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల మీడియా కార్యక్రమంలో చిత్రాంగద సింగ్ మాట్లాడుతూ జోకర్ సినిమాలో నేను చేసిన ఐటమ్ సాంగ్‌కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది.. కాబట్టి రాబోయే కాలంలో బాలీవుడ్‌లో మరిన్ని ఐటమ్ సాంగ్‌లలో నటించే అవకాశాలున్నట్లు తెలిపింది.
ఐటమ్ సాంగ్స్ మీద పూర్తిగా దృష్టి సారించలేదు. అయినా నేను డ్యాన్స్ చాలా సౌకర్య వంతంగా చేశాను. మొదట్లో నేను డ్యాన్స్ చేయడానికి పనికిరానేమోనని అనుకున్నాను, కానీ డ్యాన్స్ మాస్టర్ ఫరాఖాన్ నాతో అధ్బుతమైన స్టెప్పులు వేయించారని 36 సంవత్సరాల వయసు కలిగిన చిత్రాంగద సింగ్ తెలిపారు.
జోకర్ సినిమా ప్రమోషన్స్‌లో హీరో అక్షయ్ కుమార్ కనిపించడం లేదని అడిగిన ప్రశ్నకు గాను నాకు తెలియదు, అయినా అతను ఎందుకు ప్రమోషన్స్ లో భాగం కావాలని అడిగారు. జోకర్ సినిమా పెద్ద వాళ్లతో పాటు చిన్న పిల్లల్ని కూడా థియేటర్‌కు రప్పిస్తుందని చెప్పారు. శిరీష్ కుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, చిత్రాంగద సింగ్, మినిషా లంబా తదితరులు నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని ఆగస్టు 31న విడుదల చేస్తున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











