విడాకుల వార్తపై సెక్సీ లేడీ రుసరుస

అయితే ఆ వార్తలు తాజాగా అసత్యమని తేలింది. చిత్రంగద సింగ్ స్వయంగా ఈ వార్తలను ఖండించింది. ఇటవల ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇటీవల గుర్ గావ్ కోర్టుకు ఓ ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసమే వెళ్లామని ఆమె చెప్పుకొచ్చారు.
చిత్రాంగద సింగ్ సన్నిహితుల చెబుతున్నదాని ప్రకారం, విడాకుల వార్తలపై ఆమెతో పాటు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చాలా డిస్టర్బ్ అయ్యారని తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం చిత్రాంగద, జ్యోతి రంధవాకు పెళ్లయింది. వీరికి జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ప్రేమతో సాగుతోందని చెబుతున్నారు.
ఒక ఇంటర్నేషనల్ గోల్ఫర్ కు భార్యగా చిత్రాంగద సింగ్ ఎంతో సంతోషంగా ఉందని, జ్యోతి రంధవా కూడా తన తన భార్య బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకోవడంపై హ్యాపీగా ఉన్నాడని, ఇలాంటి అన్యోన్యమైన దంపతులపై విడాకుల ప్రచారం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











