నాగ్ సరసన ఆమె?
నాగార్జున హీరోగా త్వరలో ప్రారంభం కానున్న నూతన చిత్రంలో చిత్రాంగద అనే బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. ఐసిఐసిఐ, అలూకాస్ జ్యూయలరి వంటి వాటికి మోడల్ గా పనిచేసిన చిత్ర 2003లో రిలీజైన హజరూన్ క్వాషిష్ ఐసి చిత్రంతో తెరంగ్రేటం చేసి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కల్..వెస్టర్ డే అండ్ టుమారో అనే చిత్రంలోనూ చేసింది. తర్వాత 2005 నుంచి 2008 దాకా బ్రేక్ తీసుకుంది. తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇస్తూ సారీ భాయి చిత్రంలోనూ,సుధీర్ మిశ్రా ధ్రువ్ లోనూ చేసింది.
ఇక స్మితాపాటిల్ పోలికలు ఉండే చిత్రాంగదను తెలుగులోనూ ఎంపిక చేయటంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రం ద్వారా నాగార్జున కిరణ్ కుమార్ అనే నూతన దర్శకుడుని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. డి.శివ ప్రసాద్ రెడ్డి తన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 24 నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. నాగార్జునకి సెంటిమెంట్ అయిన డిసెంబర్ నెలలో ఈ చిత్రం రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











