తెరపై సుస్మితా సేన్ నిజ జీవిత లైంగిక వేధింపులు
న్యూడిల్లీ: నిజ జీవితాలు తెరకెక్కించటం ఇప్పుడు దర్శకులు చేస్తున్న పని. అలాంటి సినిమాలు అయితే సెన్సేషన్ క్రియేట్ చేసి బిజినెస్ చేస్తాయని భావిస్తున్నారు. తాజాగా సుస్మితా సేన్ జీవితంలో చోటు చేసుకొన్న ఓ చేదు సంఘటన తెరపైకి రాబోతోంది. గతంలో ఆమెను మోడల్‌గా ఎంచుకొంది ఓ శీతల పానీయాల సంస్థ. ఆ సందర్భంలో సుస్మితకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.
ఈ సంఘటన ఆధారంగా సుధీర్ మిశ్రా హిందీలో ఓ సినిమా రూపొందించబోతున్నారు. ఇందులో ప్రధాన పాత్ర చిత్రంగదా సింగ్ పోషించే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రం ఓ కోర్ట్ రూమ్ డ్రామ్ గా నడవ నుంది. ఈ చిత్రంలో చిత్రాంగద ఓ యాడ్ ఏజన్సీ క్రియేటివ్ డైరక్టర్ గా కనిపించనుంది. యాడ్ ఏజన్సీలో ఆమెకు...సుస్మితా సెన్ నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటన లాంటిది జరుగుతుంది. అక్కడ నుంచి ఆమె ఎలా రియాక్టు అయ్యింది అనే విషయాన్ని రియలిస్టిక్ తీస్తామని దర్శకుడు చెప్తున్నారు.
ఇక సుస్మితాసేన్..ఆ శీతలపానీయ సంస్ధపై కేసు వేసారు. ఆమెను తమ సంస్ధ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగటానికి వారు సెక్సువల్ పేవర్ అడిగారు. అప్పట్లో అదో సంచలనం అయ్యింది. అయితే ఆ చేదు సంఘటన తన జీవితాన్ని వీడి పోలేదంటోంది సుస్మిత. తెరపై అయినా న్యాయం జరుగుతుందని ఆమె అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications












