For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Cobra Twitter Review: కోబ్రాకు అలాంటి టాక్.. ఆ ట్విస్ట్ హైలైట్.. అది మాత్రం బిగ్ మైనస్!

  |

  తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తన నటనతో భారతదేశం మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు చియాన్ విక్రమ్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న ఆయన.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో చాలా కాలం క్రితమే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి వచ్చేందుకు చాలా గ్యాప్ తీసుకున్న విక్రమ్.. ఇప్పుడు 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? అనే వాటిపై ట్విట్టర్ రివ్యూ మీ కోసం!

  కోబ్రాగా ఎంట్రీ ఇచ్చేసిన విక్రమ్

  కోబ్రాగా ఎంట్రీ ఇచ్చేసిన విక్రమ్

  చియాన్ కోబ్రా హీరోగా నటించిన తాజా చిత్రమే 'కోబ్రా'. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు చేశారు.

  HBD Nagarjuna: నాగార్జునకు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఇలా.. ప్రపంచంలో ఏకైక హీరోగా రికార్డు

  అంచనాలు పెంచేసిన అప్డేట్స్

  అంచనాలు పెంచేసిన అప్డేట్స్

  మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కోబ్రా' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో విక్రమ్ నటించిన ఈ మూవీపై తెలుగు, తమిళంలో బజ్ ఏర్పడింది.

  బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

  బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

  'కోబ్రా' మూవీకి తమిళంలో దాదాపు రూ. 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా దీనికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక, అన్ని చోట్లా ఇది గ్రాండ్‌గా విడుదలైంది.

  పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

  కోబ్రా సినిమాకు అలాంటి టాక్

  కోబ్రా సినిమాకు అలాంటి టాక్

  కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాగుందని పలువురు, ఏవరేజ్ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  'కోబ్రా' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందట. అలాగే, విక్రమ్‌ను గెటప్‌లు అదిరిపోతాయట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత నిరాశ పరుస్తుందని తెలిసింది. అయితే, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందట.

  హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన 'కోబ్రా' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో విక్రమ్ నటన అద్భుతంగా ఉందట. అలాగే, ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీన్స్, గెటప్‌లు, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్లస్ అయినట్లు తెలిసింది. అయితే, సెకెండాఫ్‌లో సినిమా నిడివి, లవ్ ట్రాక్, కామెడీ లేకపోవడం, లాజిక్ లేని సీన్స్ దీనికి మైనస్‌గా మారాయట.

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

  తాజా సమాచారం ప్రకారం.. విక్రమ్ నటించిన 'కోబ్రా' మూవీ పూర్తిగా చియాన్ అభిమానులను అలరించే యాక్షన్ ప్యాక్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ వన్ మ్యాన్ షో చేశారని చెబుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. అలాగే, వేరే సినీ ప్రియులకు కూడా అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం బాగా నచ్చుతుందని టాక్.

  Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

  హైలైట్.. బిగ్ మైనస్‌లు ఇవేనట

  హైలైట్.. బిగ్ మైనస్‌లు ఇవేనట

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కోబ్రా' మూవీ చూసిన వాళ్లంతా ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. ఈ మూవీలో ఫస్టాప్ గంటన్నర పాటు సాగడంతో బోర్ ఫీలింగ్ వస్తుందట. అయితే, ఇంటర్వెల్ ట్విస్ట్ మతిపోగొట్టేలా ఉంటుందట. ఇక, లాజిక్ లేకుండా ఉన్న సన్నివేశాలు మాత్రం ఈ చిత్రానికి పెద్ద మైనస్‌గా మారాయని వీక్షకులు చెబుతున్నారు.

  English summary
  Kollywood Star Vikram Did Cobra Movie Under R. Ajay Gnanamuthu Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X